News January 12, 2025
కుంభమేళా వెనుక కథ ఏంటంటే..

కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.
Similar News
News November 25, 2025
12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.
News November 25, 2025
T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.
News November 25, 2025
అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.


