News February 21, 2025

అఫ్గానిస్థాన్ టార్గెట్ ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికా అఫ్గానిస్థాన్ ముందు 316 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రొటీస్ ఓపెనర్ రికెల్‌టన్(103) సెంచరీతో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా, డుసెన్, మార్క్‌రమ్ అర్ధసెంచరీలతో రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో నబీ 2, ఫరూఖీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

Similar News

News November 11, 2025

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.

News November 11, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) 12 కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in

News November 11, 2025

పెరగనున్న చలి.. ఇవాళ్టి నుంచి జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న TGలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. అటు APలోని విశాఖ, మన్యం జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.