News July 21, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News November 11, 2025
ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

AP: తిరుపతి (D) కేవీబీపురం(M) ఒల్లూరులోని రాయలచెరువుకు గండి పడటంతో నీటమునిగిన కళత్తూరు ఎస్సీ కాలనీ, SL పురం, పాతపాలెం ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 960 కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3.24కోట్లు మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.3వేలు, 25కిలోల బియ్యం తదితర నిత్యావసరాలు అందించనున్నారు. అలాగే వరదలో చనిపోయిన 1,100 పశువులకు CM రిలీఫ్ ఫండ్ నుంచి రూ.83.50లక్షల పరిహారం ఇవ్వనున్నారు.
News November 11, 2025
చక్కటి కురులకు చక్కెర స్నానం

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
News November 11, 2025
ఏపీ అప్డేట్స్

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ


