News September 8, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.
Similar News
News November 17, 2025
నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.
News November 17, 2025
శివ పూజలో తులసిని వాడుతున్నారా?

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.
News November 17, 2025
iBomma ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా?

ఇమ్మడి రవి అరెస్టుతో iBomma, బప్పం టీవీ <<18302048>>బ్లాక్ <<>>అయిన విషయం తెలిసిందే. అయితే అవి ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. iBommaకు ముందు ఎన్నో పైరసీ సైట్లు ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాటిపైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఐబొమ్మ ప్లేస్లోకి అవి వస్తాయంటున్నారు. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. మీరేమంటారు?


