News September 28, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా 24,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీల ద్వారా ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
Similar News
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.
News October 19, 2025
JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

JEE MAIN-2026 <
News October 19, 2025
సహజీవనంలో మహిళలకు ఉండే హక్కులేంటి?

ప్రస్తుతం మన దేశంలోనూ సహజీవన వ్యవస్థ పెరుగుతోంది. ఇందులో మహిళకు శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, ఫోటోలు, వీడియోలు లీక్ అయితే చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ జంటకు పుట్టే పిల్లలకు వారసత్వఆస్తిలో హక్కు ఉంటుందని కోర్టు గతంలో స్పష్టంచేసింది. పరస్పర సమ్మతి లేకుండా బంధాన్ని తెంచుకుంటే మెయింటెనెన్స్ అలవెన్స్ పొందే హక్కూ ఉంది. ఈ బంధంలోకి వెళ్లే ముందు మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.