News March 3, 2025
బ్లూఫ్లాగ్ గుర్తింపుతో ఉపయోగం ఏంటి?

తీర ప్రాంత జలాల్లో మెరుగైన అభివృద్ధి తీసుకురావడమే ఈ <<15632535>>బ్లూఫ్లాగ్ <<>>లక్ష్యం. వరల్డ్ మ్యాప్‌లో కూడా బీచ్‌లకు ఈ గుర్తింపు చూడవచ్చు. ఈ గుర్తింపు ఉన్న బీచ్‌లను సందర్శించడానికి విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ ఫ్లాగ్ ఉంటే శుభ్రత, భద్రత పరంగా ఇబ్బంది ఉండదని వాళ్లు భావిస్తారు. ఈ ఫ్లాగ్ ఉన్న బీచ్‌ల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Similar News
News March 3, 2025
ఆత్మహత్య చేసుకుంటా.. సుప్రీం కోర్టుకు లాయర్ బెదిరింపు

తాను వాదిస్తున్న కేసులో పిటిషన్‌ను విచారణకు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ న్యాయవాది ఏకంగా సుప్రీం కోర్టునే బెదిరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ నెల 7లోపు తమకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో బార్ లైసెన్స్ రద్దు చేసి అరెస్టు చేయిస్తామని తేల్చిచెప్పింది.
News March 3, 2025
రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.
News March 3, 2025
రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.