News September 23, 2024
అమెరికా పంపే డ్రోన్లతో ఉపయోగాలేంటి?

అమెరికా నుంచి భారత్ <<14173073>>సమకూర్చుకోనున్న<<>> 31 MQ- 9B ప్రిడేటర్ డ్రోన్లు దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నాయి. చైనా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో 16 గగనతల, 15 సముద్రతీర రక్షణ డ్రోన్లను మోహరించనున్నారు. ఈ డ్రోన్లు 35 గంటలపాటు ఏకధాటిగా గాల్లో ఉండగలవు. 50,000 అడుగుల ఎత్తులో 442 km/h అత్యధిక వేగంతో ఎగురగలవు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో 1,700 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలవు.
Similar News
News December 9, 2025
పుట్టగూడెం, మల్లన్నగూడెం మరోసారి ఏకగ్రీవం

గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజాపేట మండలంలోని పుట్టగూడెం, మల్లన్నగూడెం గ్రామ పంచాయతీలు ఈసారి కూడా ఏకగ్రీవమయ్యాయి. పుట్టగూడెంలో 332 మంది ఓటర్లు, మల్లన్నగూడెంలో 759 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకుల సమన్వయంతో శాంతియుతంగా ఏకగ్రీవం సాధించారు. ప్రజల ఐక్యతతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకున్న ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


