News July 4, 2025
పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Similar News
News July 4, 2025
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్‌లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.
News July 4, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా? క్లారిటీ!

మొహర్రం పురస్కరించుకుని గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అయితే ఏపీలో రేపు స్కూళ్లకు రావాల్సిందేనని టీచర్లను అధికారులు ఆదేశించారు. పాఠశాలలోని 50% మంది టీచర్లు విధులకు రావాలని, పిల్లలకు యథావిధిగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. అటు తెలంగాణలో రేపు హాలిడే ఉంటుందని మెసేజులు రాలేదు. మరి మీకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
News July 4, 2025
టెన్త్ విద్యార్థులకు బహుమతిగా సైకిళ్లు: బండి సంజయ్

TG: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ప్రధాని మోదీ 20వేల సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈనెల 11న తన బర్త్‌డే సందర్భంగా 8, 9 తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. KNR, SRCL, JGL, SDPT, HNK జిల్లాల్లోని విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.4వేలు అని, వాటిపై PM ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.