News October 23, 2024
ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆయన కేవలం సినిమాల ద్వారానే ఆదాయాన్ని పొందుతారని, ప్రకటనలకు ఆమడ దూరంలో ఉంటారని వెల్లడించాయి. ప్రస్తుతం రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన ఇప్పటివరకు 23 సినిమాలు చేశారు. ఆయనకు రూ.కోట్ల విలువైన కార్లు, బంగ్లాలున్నాయి.
Similar News
News December 18, 2025
కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
News December 18, 2025
నితీశ్ కుమార్‌కు పాక్ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు!

బిహార్ CM నితీశ్ కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగిన<<>> ఘటనపై నితీశ్ క్షమాపణలు చెప్పాలని పాక్ గ్యాంగ్‌స్టర్ షహ్జాద్ భట్టి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియాలో హెచ్చరించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డాడు. ఈ బెదిరింపు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతానికి వివరాలేమీ లేవని DGP వినయ్ కుమార్ తెలిపారు.
News December 18, 2025
ట్రైన్‌లో రాత్రిపూట ప్రయాణిస్తున్నారా?

ఎక్కువ దూరం రైలులో వెళ్లాలంటే చాలామంది రాత్రి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. 10:00 PM తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మ్యూజిక్ పెట్టకూడదు. వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ-టికెట్‌తో ప్రయాణించే వారు ID కార్డు చూపించాలి. మద్యం సేవించడం నేరం. ఏదైనా సమస్య వస్తే RPF లేదా 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.


