News March 27, 2024

తమిళిసై ఆస్తుల విలువ ఎంతంటే?

image

చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమిళిసై సౌందరరాజన్ అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ ప్రకటించారు. తనకు రూ.2.17 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో రూ.50 వేల నగదుతోపాటు రూ.1.57 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Similar News

News October 4, 2024

1,497 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

image

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750(SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి <>https://sbi.co.in<<>> వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News October 4, 2024

ఇరాన్ పోర్టులో భారత WAR SHIPS.. ఆగిన ప్రతీకార దాడి!

image

ఇరాన్ మిసైళ్ల దాడికి ఇజ్రాయెల్ ఎందుకు ప్రతీకారదాడి చేయలేదు? అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. యుద్ధ నిపుణులు భారత్‌నూ ఓ కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం INS శార్దూల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్‌తో కలిసి ఓ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఎయిర్‌స్ట్రైక్స్ జరిగితే కలిగే నష్టం అపారం. అందుకే ఇజ్రాయెల్‌తో భారత్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. నౌకలు తిరిగొచ్చాక ఏమవుతుందో చూడాలి.

News October 4, 2024

క్రూడ్ రేట్లకు ఫైర్ అంటించిన జో బైడెన్!

image

బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలే ఇందుకు కారణం. మొన్నటి వరకు బ్యారెల్ సగటున $70 పలికింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి మారింది. ఇరాన్ ఆయువుపట్టయిన ఆయిల్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల గురించి డిస్కస్ చేస్తామని జోబైడెన్ గురువారం చెప్పారు. దీంతో క్రూడ్ వెంటనే $75 డాలర్లకు చేరింది. ఇవాళ ఇంకా పెరిగే ఛాన్సుంది.