News October 4, 2024

వారం రోజులకు ‘దేవర’ కలెక్షన్లు ఎంతంటే?

image

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

Similar News

News January 22, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’కు దారుణమైన కలెక్షన్లు

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.

News January 22, 2026

NALCOలో 110 పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BTech/BE(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. GATE-2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 22, 2026

గురు గ్రహ బలం పెంచుకోవాలంటే..?

image

గురు గ్రహ బలం పెంచుకోవాలంటే మహిళలు పుట్టింటి నుంచి తెచ్చిన దీపపు కుందులతో నిత్యం దీపారాధన చేయాలి. చీమలు ఎక్కువగా ఉన్న చోట చక్కెరను ఆహారంగా చల్లాలి. సాధువులకు నెయ్యి దానం చేయడం శుభప్రదం. ఇంటికి పడమర దిశలోని శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యం దానమివ్వాలి. ఇంటి ఈశాన్యంలో 9 వత్తుల నేతి దీపం వెలిగించాలి. గురుస్తోత్రం పఠించడం మరింత శ్రేష్ఠం. వేంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల గురు గ్రహ బలం చేకూరుతుంది.