News May 5, 2024
ఇదేం ఆట?.. మ్యాక్స్‌వెల్‌పై తీవ్ర విమర్శలు

మ్యాక్స్‌వెల్‌పై RCB అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 7 మ్యాచ్‌లు ఆడిన అతను 5.14 యావరేజ్‌తో కేవలం 36 రన్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి రూ.11 కోట్ల వృథా అని ఫైరవుతున్నారు. వాళ్ల దేశం తరఫున అయితే హిట్టింగ్ చేస్తాడని, IPLలో విఫలమవుతాడని విమర్శిస్తున్నారు. మ్యాక్సీ ఈ సీజన్లో వరుసగా 0(vsCSK), 3(vsPBKS), 28(vsKKR), 0(vsLSG), 1(vsRR), 0(vsMI), 4(vsGT) పరుగులు చేశారు.
Similar News
News September 18, 2025
‘మార్కో’ సీక్వెల్‌కు ఉన్ని ముకుందన్ దూరం!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<