News October 20, 2024
ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ?: జగన్

AP: కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే బద్వేల్ ఘటనకు కారణమని ఆరోపించారు. నిత్యం ఏదోచోట అత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని, ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, ఇప్పుడు దాని ప్రాధాన్యం తెలుస్తోందని జగన్ అన్నారు.
Similar News
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 10, 2025
వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 °C తక్కువగా నమోదవుతాయని HYD IMD తెలిపింది. ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NML, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 6.1°C నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.
News December 10, 2025
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<


