News August 21, 2024
అసలు ఈ ‘సెజ్’ అంటే ఏంటి?

సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆర్థిక వృద్ధిని సృష్టించడానికి రూపొందించిన నిర్దిష్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలకు పన్ను మినహాయింపులతో పాటు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. ఇతర కంపెనీలతో పోల్చితే నిబంధనల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడం. APలో మొత్తం 30 SEZ కంపెనీలకు అనుమతి రాగా 19 కంపెనీలు నిర్వహణలో ఉన్నాయి.
Similar News
News October 16, 2025
5,346 టీచర్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలో 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు DSSSB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/
News October 16, 2025
వేపాకుల కండిషనర్తో చుండ్రుకు చెక్

అమ్మాయిలకు జుట్టే అందం. ఒత్తయిన వెంట్రుకల కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఇంట్లోనే వేపాకులతో తయారుచేసుకున్న హెయిర్ కండిషనర్ మేలంటున్నారు నిపుణులు. ‘వేపాకులను నీళ్లలో మరిగించి గుజ్జుగా చేసి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్గా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడమూ తగ్గుతుంది’ అని చెబుతున్నారు.<<-se>>#HairCare<<>>
News October 16, 2025
బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.