News August 15, 2024

ఈ టైటిల్ ఏంటో చెప్పండి?

image

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన 19వ చిత్ర టైటిల్‌కు సంబంధించి ఆసక్తికర ప్రశ్న సంధించారు. ‘అది ఒక ఆది యోగి పేరు!! చంద్రుణ్ని తలపై కిరీటంగా కలవాడు. ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు’ అంటూ రాసుకొచ్చారు. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఎల్లుండి రిలీజ్ చేయనున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమై ఉంటుందో చెప్పండి?

Similar News

News July 5, 2025

నితిన్ ఖాతాలో మరో ప్లాప్?

image

నిన్న విడుదలైన ‘తమ్ముడు’ మూవీపై సినీ అభిమానులు, క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. వరుస ప్లాప్‌ల తర్వాత కథ విషయంలో నితిన్ ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని, మరో ఫెయిల్యూర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. డైరెక్టర్ వేణు ఏం చెప్పాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదని, నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలా అంగీకరించారో ఆశ్చర్యంగా ఉందని SMలో కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.

News July 5, 2025

అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ సన్నాహాలు!

image

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాసైతే కొత్త పార్టీ పెడతానని మస్క్ ఇటీవల ప్రకటించారు. తాజాగా <<16891089>>బిల్ <<>>చట్టరూపం దాల్చడంతో ‘అమెరికా పార్టీ’ పెట్టడంపై మస్క్ హింట్ ఇచ్చారు. ‘2 లేదా 3 సెనేట్ సీట్లు, 8-10 హౌస్ డిస్ట్రిక్ట్స్‌లో ఫోకస్ చేస్తే ఫలితముంటుంది. ప్రజలకు మేలు చేస్తూ వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓటు వేయడానికి ఈ సీట్లు సరిపోతాయి’ అని ట్వీట్ చేశారు. పార్టీ లాంచ్‌కు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి.

News July 5, 2025

క్యాన్సర్‌తో మార్వెల్ నటుడు మృతి

image

హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్‌మహన్(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య కెల్లీ ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా Ex PM విలియమ్ కుమారుడైన జులియన్ 2003లో Nip/Tuck మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మార్వెల్ మూవీస్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’లో ‘Dr.డూమ్’గా పాపులర్ అయ్యారు. ఇటీవల ‘FBI: మోస్ట్ వాంటెడ్’లో లీడ్ రోల్ పోషించారు. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.