News October 28, 2024
DMK, AIDMKలో విజయ్ ముంచేది దేనిని?

యాక్టర్ విజయ్ TVK పార్టీ TN రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ నెలకొంది! ఇన్నాళ్లూ DMKకు అండగా ఉన్న క్రిస్టియన్, దళిత ఓట్లలో మెజారిటీ TVKకు వెళ్తాయని అంచనా. జయలలిత తర్వాత పటిష్ఠ నాయకత్వం లేక నైరాశ్యంలో ఉన్న AIDMK యూత్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల న్యూట్రల్ ఓట్లూ కొంత టర్నవుతాయి. ఇది అసెంబ్లీలో 37% నుంచి లోక్‌సభలో 26%కి ఓట్లు పడిపోయిన DMKకే నష్టం కావొచ్చని అంచనా.
Similar News
News January 2, 2026
AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://ampri.res.in
News January 2, 2026
సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్‌గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్‌కు తోడు ఎక్కువ ఎక్సర్సైజులు చేయిస్తున్నారు.
News January 2, 2026
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.


