News September 6, 2024
విజయ్ ‘గోట్’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘గోట్’ మూవీ తొలి రోజు కలెక్షన్లు అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.126.32 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలకపాత్రలు పోషించారు.
Similar News
News January 26, 2026
చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే..

చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే బ్రూడింగ్ ముఖ్యం. దీని కోసం 200 వాట్ల విద్యుత్ బల్బులను 100 కోడి పిల్లలకు ఒకటి చొప్పున షెడ్లో ఏర్పాటు చేసుకోవాలి. ఫారమ్ చుట్టూ టార్పాలిన్ కవర్లను కప్పి షెడ్ లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 32-35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. షెడ్లో కింద 2 అంగుళాల మేర పొట్టు వేసుకొని దానిపై న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఈ చర్యల వల్ల కోడి పిల్లల మరణాలు చాలా వరకు తగ్గుతాయి.
News January 26, 2026
నేడు భీష్ముడికి తర్పణం సమర్పిస్తే..?

భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి లేదా తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్మృతి కౌస్తుభం చెబుతోంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, లోకమంతా ఆయనకు సంతానమేనని శాస్త్ర వచనం. అందుకే తండ్రి బతికున్న వారు కూడా ఈ రోజున ఆయనకు తర్పణం ఇవ్వవచ్చు. ‘వైయాఘ్య్రపద గోత్రాయ’ అనే శ్లోకం పఠిస్తూ నీటిని వదలడం వల్ల సంవత్సర కాలం పాటు చేసిన పాపాలు నశిస్తాయని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
News January 26, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో <


