News April 18, 2024
VVPAT అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

VVPAT అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. దీన్ని EVMకు కనెక్ట్ చేస్తారు. EVMలో ఓటేయగానే.. అభ్యర్థి గుర్తు, పార్టీ పేరు మిషన్లోని తెరపై కనిపిస్తాయి. వెంటనే ఆ వివరాలు చిన్నకాగితంలో ప్రింటయ్యి అడుగున ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. కౌంటింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల VVPATలు, EVM ఓట్లను సరిపోల్చుతారు. కాగా మాక్పోల్లో BJPకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని విపక్షాలు <<13076328>>సుప్రీంను<<>> ఆశ్రయించాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News January 19, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.


