News June 1, 2024

విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

image

ఏదైనా కంపెనీకి అకస్మాత్తుగా వచ్చే భారీ లాభాలపై అధిక పన్నును విధించడాన్ని <<13353544>>విండ్‌ఫాల్<<>> ట్యాక్స్ అంటారు. ఇది సాధారణ పన్నుకు అదనం. US, UK, మంగోలియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది అమల్లో ఉంది. జులై 2022 నుంచి పెట్రోలియం ఎగుమతులపై ఇండియా కూడా ఈ పన్ను విధిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ముడి చమురు ధరలు పెరగడం, తగ్గడాన్ని బట్టి ట్యాక్స్‌లో మార్పులు ఉంటాయి.

Similar News

News January 20, 2025

ట్రంప్ వ్యక్తిగత సమాచారం

image

డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకొని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.

News January 20, 2025

లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం

image

AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్‌లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News January 20, 2025

మీ SBI అకౌంట్ నుంచి రూ.236 కట్ అయ్యాయా?

image

ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వాడే యూజర్ల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తోందన్న విషయం తెలుసా? డెబిట్ కార్డు రకాన్ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. క్లాసిక్/సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్ లెస్ కార్డులకు ₹236 (₹200+18%GST), గోల్డ్/కాంబో/మై కార్డ్(ఇమేజ్) కార్డులకు ₹250+GST, ప్లాటినం కార్డులకు ₹325+GST, ప్రైడ్/ప్రీమియం కార్డులకు ₹350+GST ఛార్జ్ చేస్తోంది.