News August 19, 2024
రాజీవ్‌గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి?: కాంగ్రెస్

TG: సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న KTR వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రాజీవ్ గాంధీ వల్లే KCR రాజకీయాల్లోకి వచ్చారని VH అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. KTR తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ KTRను హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
ఈ నెల 30 వరకు అసెంబ్లీ

AP: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు (10 రోజులు) నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను ప్రతిపాదించింది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. మరోవైపు శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. కాగా ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టవ్వగా, నలుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.
News September 18, 2025
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్‌లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.