News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News January 2, 2026
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందోయ్!

కేరళలో నిన్న BJP పేపర్ ‘జన్మభూమి’లో IUML పేపర్ ‘చంద్రిక’ కంటెంట్ వచ్చింది. ఉదయమే జన్మభూమి చదువుతూ, మధ్యలో BJPని తిట్టే కంటెంట్ చూసి కమల నేతలు ఆశ్చర్యపోయారు. ఇరు పేపర్ల కన్నూర్-కాసర్గోడ్ ఎడిషన్ ఒకే ప్రెస్లో ప్రింట్ అవుతుంది. అక్కడ పొరపాటున అవతలి పార్టీ కంటెంట్ ప్రింట్ అయిందని తర్వాత తెలిసింది. కాగా BJP-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బ్యాక్ డోర్ దోస్తీని ఈ ప్రెస్ నిరూపించిందని CPIM విమర్శించింది.
News January 2, 2026
జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.
News January 2, 2026
BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.


