News August 2, 2024

దానం మాట్లాడితే తప్పేం ఉంది?: CM రేవంత్

image

TG: 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న MLA దానం సభలో మాట్లాడితే తప్పేంటని CM రేవంత్ ప్రశ్నించారు. HYDలోని ప్రతి సమస్యా తెలిసిన వ్యక్తిని మాట్లాడవద్దనే అధికారం ప్రతిపక్షానికి లేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేసినట్లు తాము చేయలేమా? అన్నారు. అరడజను మందిని సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుందన్నారు. పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానంకు మైక్ ఇవ్వడాన్ని BRS వ్యతిరేకించింది.

Similar News

News April 11, 2026

అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

News April 11, 2026

కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

image

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్‌లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

News April 11, 2026

డీల్ కుదరకపోతే.. అమెరికా ప్లాన్-B ఏంటి?

image

ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైతే అమెరికా ప్లాన్-Bతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పశ్చిమాసియాలో ఆయుధాలు, బలగాలను మోహరిస్తున్నట్లు టాక్. ట్రంప్ సైతం ఆ దిశగా హింట్ ఇచ్చారు. నౌకలను ఆయుధాలతో లోడ్ చేస్తున్నామని హెచ్చరించారు. దీంతో ఓవైపు దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే దాడులకూ అగ్రరాజ్యం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.