News January 18, 2025
భారత జట్టుపై మీ కామెంట్?

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టును ప్రకటించగా కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ రెడ్డితో పాటు కరుణ్ నాయర్‌ను తీసుకోకపోవడంపై విమర్శలకు దిగారు. టీమ్‌కి 15 మందే కావాలని అజిత్ అగార్కర్ అనడంపై సెటైర్లు వేస్తున్నారు. జట్టులో ఉన్నవారంతా అద్భుత ప్లేయర్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. యంగ్స్టర్లకు అవకాశమివ్వాలని, సెంచరీలు చేసిన కరుణ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 6, 2025
మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.
News November 6, 2025
ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


