News August 21, 2024

ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం?

image

ఏపీ, తెలంగాణకు చెందిన ఎస్సీల్లో మాలలు, మాదిగలు, రెల్లి లాంటి 57 ఉపకులాలు ఉన్నాయి. జనాభాలో తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారనేది మాదిగల ఆవేదన. ఎస్సీలను A, B, C, D వర్గాలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. అయితే వర్గీకరణతో తాము రిజర్వేషన్లు కోల్పోతామని మాలలు మండిపడుతున్నారు. మరి వర్గీకరణ న్యాయమా? కాదా? కామెంట్ చేయండి.

Similar News

News December 16, 2025

453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

image

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్‌కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.

News December 16, 2025

విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

image

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.

News December 16, 2025

TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 4వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ Eng., CS&IT, DS& AI) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023, 2024, 2025లో అర్హత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.