News December 25, 2024

కొత్త ఏడాదిలో మీ రిజల్యూషన్ ఏంటి?

image

నూతన సంవత్సరం అనగానే కొత్త మార్పులను చాలా మంది కోరుకుంటారు. డబ్బులు ఆదా చేయడం, స్మోకింగ్, మద్యం మానేయడం, జిమ్‌కి వెళ్లడం, డైటింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రయాణాలు చేయడం వంటి రిజల్యూషన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి కొత్త ఏడాదిలో మీరు ఎలాంటి రిజల్యూషన్ తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News September 14, 2025

వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు?

image

వాటర్ క్యాన్‌లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

News September 14, 2025

ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

image

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.

News September 14, 2025

SBIలో 122 పోస్టులు

image

<>ఎస్బీఐ<<>> 122 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 59, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు OCT 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/