News April 25, 2024
జీరో షాడో డే అంటే ఏంటి?

బెంగళూరులో ఇవాళ ‘జీరో షాడో డే’. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు 6 నిమిషాల పాటు నీడ మాయం కానుంది. కాగా సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. సూర్యుడు +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
Similar News
News December 31, 2025
ఇన్సెంటివ్స్ పెంచిన స్విగ్గీ, జొమాటో

డెలివరీ పార్ట్నర్స్ స్ట్రైక్తో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు జొమాటో, స్విగ్గీ పార్ట్నర్స్కు మెసేజెస్ పంపాయి. డెలివరీకి ₹120-150తో ఇవాళ ₹3000 వరకు సంపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఉండవు. స్విగ్గీ అయితే నేడు, రేపు ₹10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.
News December 31, 2025
Money Tip: మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్ అవుతుందో తెలుసా?

మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి ‘72’ ఒక మ్యాజిక్ నంబర్. ఉదాహరణకు మీకు 8% వడ్డీ వస్తుంటే.. 72ను 8తో భాగిస్తే వచ్చే 9 ఏళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 6 ఏళ్లలోనే మీ పెట్టుబడి డబుల్ అవ్వాలనుకుంటే మీకు 12% వడ్డీ ఇచ్చే స్కీమ్ ఎంచుకోవాలని ఇది చెబుతుంది. ద్రవ్యోల్బణం మీ డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో కూడా ఈ సింపుల్ ట్రిక్ ద్వారా చిటికెలో లెక్కించవచ్చు.
News December 31, 2025
దుర్భరంగా స్వర్ణకారుల జీవితం

బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీతో ఆభరణాలు తయారు చేస్తుండటంతో సంప్రదాయ స్వర్ణకారుల జీవితం కుదేలవుతోంది. నెలకు వేల రూపాయలు సంపాదించిన కార్మికులు ప్రస్తుతం రోజువారీ కూలీలుగా మారుతున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. తరతరాలుగా కొనసాగిన వృత్తి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


