News September 3, 2025
ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News September 4, 2025
అన్ని కార్ల ధరలు తగ్గుతాయ్..

కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..
News September 4, 2025
స్వాగతిస్తున్నాం.. కానీ చాలా ఆలస్యమైంది: చిదంబరం

GST సంస్కరణలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, MP చిదంబరం స్పందించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, గూడ్స్&సర్వీసెస్‌పై ట్యాక్స్ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ చాలా ఆలస్యమైంది. 8 ఏళ్ల క్రితం GST ప్రవేశపెట్టినప్పుడే ఈ పని చేయాల్సింది. ఇంతకాలం రేట్లను తగ్గించాలని మేం ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ట్రంప్ సుంకాలా? బిహార్ ఎన్నికలా?’ అని ప్రశ్నించారు.
News September 4, 2025
నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయమై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.