News October 27, 2024
రేవ్ పార్టీలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు: కాంగ్రెస్

TG: జన్వాడ ఫామ్హౌస్లో అసాంఘిక కార్యకలాపాలపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్ఫ్రీ రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్నవారి వివరాలు బయటపెట్టాలని MLC బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలను ప్రోత్సహించేది బీఆర్ఎస్సేనని బండ్రు శోభారాణి ఆరోపించారు.
Similar News
News December 23, 2025
Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.
News December 23, 2025
‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.
News December 23, 2025
మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరిఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


