News March 29, 2024
ఏ సంచలనం నమోదు చేస్తారో?

ఇవాళ RCB, కేకేఆర్ మధ్య బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచుల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. IPLలోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ(49) KKRపై చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరోవైపు సొంత మైదానంలో KKRపై 2015 తర్వాత విజయం సాధించలేకపోయింది. మరి ఈ మ్యాచులో గెలిచి పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
Similar News
News September 15, 2025
ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.
News September 15, 2025
NIRDPRలో 150 ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో 150 ఎన్యూమరేటెర్ పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. 45 ఏళ్ల లోపు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన, పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <
News September 15, 2025
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

ఖతర్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతర్ తమ మిత్రదేశమని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఖతర్‌లోని దోహాలో దాక్కున్న హమాస్ కీలక నేతలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.