News December 14, 2024

సిబిల్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి?

image

మీ ఆర్థిక పరిస్థితిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్‌) ఇచ్చే రేటింగ్‌నే సిబిల్‌ స్కోర్‌ అంటారు. ఆ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే రుణాలకు ఈజీ అవుతుంది. సిబిల్ స్కోర్ పెరగాలంటే..
* సమయానికి రుణాలు, EMI చెల్లించండి.
* సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి.
* క్రెడిట్ కార్డు లిమిట్‌ను 30% మాత్రమే ఉపయోగించాలి.
* ఇతరుల రుణాలకు గ్యారెంటీ ఉండకపోవడం బెటర్.

Similar News

News January 4, 2026

BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్‌పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్‌ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.

News January 4, 2026

రాత్రిపూట ఇవి తినకపోవడం మంచిది

image

మంచిగా నిద్ర పట్టాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా రాత్రి భోజనంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నూనెలో వేయించిన పదార్థాలు, అధిక మసాలా ఆహారం గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణమవుతాయి. తీపి పదార్థాలు, చాక్లెట్లు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని పెంచుతాయి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రాత్రి భోజనాన్ని పడుకోవడానికి 2Hr ముందే తీసుకుంటే మంచిది.

News January 4, 2026

10 నిమిషాల్లోనే డెలివరీ అయిపోవాలా?

image

డెలివరీ ఏజెంట్ల <<18740820>>నిరసనతో<<>> క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల’ డెలివరీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజార్టీ వినియోగదారులు ఇది అవసరం లేదంటున్నారు. మెడిసిన్స్ మినహా ఇతర సరుకులు ఆలస్యమైనా మునిగిపోయేదేం లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం 10 నిమిషాల్లో డెలివరీ ఉండాల్సిందేనని వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? COMMENT