News April 3, 2025
రుషికొండ భవనాలపై ఏం చేద్దాం?.. మంత్రులతో సీఎం చర్చ

AP: జగన్ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మొదట మినిస్టర్లంతా ఆ బిల్డింగులను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు. ఈ భవనాలను నిర్మించి జగన్ ప్రజాధనం వృథా చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి నిబంధనల మేరకు నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాలని వైసీపీ స్పష్టం చేస్తోంది.
Similar News
News April 4, 2025
చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్రైడర్స్

ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ చరిత్ర సృష్టించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టు PBKS-21, RCB-20, SRHపై 20 విజయాలు సాధించింది. నిన్న SRHతో జరిగిన మ్యాచులో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. కాగా సన్రైజర్స్పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
News April 4, 2025
చైనీస్తో శారీరక సంబంధాలపై అమెరికా బ్యాన్

చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరుచుకోవద్దని అమెరికా తమ దేశ ఉద్యోగస్థులను హెచ్చరించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇటీవల చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News April 4, 2025
అకడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో జూ.కాలేజీలకు సంబంధించిన 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూన్ 2 నుంచి కాలేజీలు ప్రారంభం కానుండగా, మొత్తం 226 పనిదినాలు ఉండనున్నాయి. SEP 28 నుంచి OCT 5 వరకు దసరా సెలవులు, 2026 JAN 11 నుంచి 18 వరకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. JAN లాస్ట్ వీక్లో ప్రీఫైనల్ పరీక్షలు, FEB మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చి ఫస్ట్ వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మార్చి 31 చివరి వర్కింగ్ డే.