News April 8, 2024

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

image

వడదెబ్బ తగిలితే బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దుస్తులు వదులు చేసి చన్నీళ్లతో శరీరాన్ని తడపాలని, ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయని చెబుతున్నారు. బాధితుల చంకలు, గజ్జలు, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలని పేర్కొంటున్నారు.

Similar News

News January 24, 2026

హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

image

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.

News January 24, 2026

మంటలు అదుపులోకి.. సెల్లార్‌లో ఐదుగురు: ఫైర్ డీజీ

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఆ ఏరియాలో ఫర్నిచర్ భారీగా డంప్ చేశారని, అందుకే సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిందన్నారు. మరో 2 గంటల్లో లోనికి వెళ్తామన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సెల్లార్‌లో ఐదుగురు చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

News January 24, 2026

సెక్స్ సీడీ కేసులో మాజీ సీఎంకు ఎదురుదెబ్బ

image

2017 ఛత్తీస్‌గఢ్ అశ్లీల సీడీ కేసులో మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ స్పెషల్ కోర్టు రద్దు చేసింది. మాజీ మంత్రి రాజేశ్ మున్నత్‌ను అప్రతిష్ఠపాలు చేయడానికి అశ్లీల వీడియోలు తయారు చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అదే సమయంలో ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.