News March 30, 2025
ఉగాది పండుగ రోజు ఏం చేయాలంటే?

తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినాన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తినాలి. ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. కుటుంబసభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలి. సృష్టి ఆరంభం రోజు కాబట్టి ఇవాళ కొత్త పనులు మొదలుపెట్టొచ్చు. ఇంద్రధ్వజ, బ్రహ్మ ధ్వజ, రాజదర్శనం పూజలు చేస్తే శుభం కలుగుతుంది. బంగారం, వెండి వంటి వస్తువులు కొనుక్కోవచ్చు.
Similar News
News September 12, 2025
OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.
News September 12, 2025
శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
News September 12, 2025
వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తక్కువ వేగంతో నడిస్తే క్యాలరీలు బర్న్ కావు. వేగంగా నడిస్తేనే గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయకూడదు. ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పి సమస్య వస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించి నడవాలి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదు’ అని చెబుతున్నారు.