News October 30, 2025
ఏడాది తర్వాత పిల్లలకు ఏం పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏడాది దాటాక కూడా పిల్లలకు పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి అన్నం పెడుతుంటారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. వారికి ఏడాది దాటాక నెమ్మదిగా అన్నిరకాల ఆహారాలు అలవాటు చెయ్యాలి. కిచిడీ, పొంగల్, పాలకూర పప్పు, వెజిటబుల్ రైస్ వంటివి తినిపించాలంటున్నారు.
Similar News
News October 30, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

TG: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు నవంబర్ 13 వరకు స్కూళ్ల HMలకు డబ్బు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్‌ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
News October 30, 2025
పంట నష్టం: నేటి నుంచి ఎన్యూమరేషన్

AP: మొంథా తుఫాను ధాటికి 1.23L హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38L మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్(లెక్కింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4,576KM మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
News October 30, 2025
కందిలో పచ్చదోమ – నివారణకు సూచనలు

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.


