News October 18, 2024
శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News February 1, 2026
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వరల్డ్ నెంబర్-1, స్పెయిన్ స్టార్ అల్కరాజ్, సెర్బియా వీరుడు జకోవిచ్ మధ్య నేడు తుదిపోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెన్నిస్‌లో అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా జకోవిచ్ అవతరిస్తారు. అల్కరాజ్ నెగ్గితే కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్సుంది.
News February 1, 2026
ఫిబ్రవరి 01: చరిత్రలో ఈ రోజు

♦︎ 1956: హాస్యనటుడు బ్రహ్మానందం జననం (ఫొటోలో) ♦︎ 1957: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ జననం ♦︎ 1971: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా జననం ♦︎ భారత తీర రక్షక దళ దినోత్సవం ♦︎ 1984: నటి గోపిక జననం ♦︎ 1994: సింగర్ రమ్య బెహరా జననం ♦︎ 2003: భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణం.
News February 1, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


