News December 21, 2024
70లలోనూ హృతిక్ రోషన్ తల్లి ఎలా ఉన్నారంటే?

ప్రపంచ అందగాళ్ల జాబితాలో మూడో ప్లేస్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తుంటారు. అయితే, హృతిక్ తల్లి పింకీ కూడా ఫిట్‌నెస్‌లో ఆయన్ను మించిపోయిందని నెట్టింట చర్చ జరుగుతోంది. 70 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లుగా ఫిట్‌గా ఉండటాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. జిమ్‌లో ఇద్దరూ కసరత్తు చేస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News November 17, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ఉత్పత్తిని బట్టి జీతం ఇస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. సర్క్యులర్‌ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్.
* చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే స్టీల్ ప్లాంట్‌ను ఏదో ఒకటి చేసేలా ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
* ఇక నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతానని వంగవీటి రంగా కూతురు ఆశ కిరణ్ ప్రకటన. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడి.
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 17, 2025
ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.


