News October 10, 2024
రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారు?: అవినాశ్

AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.
Similar News
News November 21, 2025
ములుగు: ‘వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి’

వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. కుటుంబ వ్యవస్థకు వయోవృద్ధులు మూలాధారమని ఆయన అన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు ఉన్నాయని, వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్డీఓకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్లు
* ఫిక్స్‌ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి


