News August 19, 2025
సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.
Similar News
News August 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల ‘గృహప్రవేశానికి’ సీఎం!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటివరకు 4వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఈనెల 21న CM రేవంత్ రెడ్డి అశ్వారావుపేటలో జరగనున్న గృహప్రవేశ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
News August 19, 2025
1GB ప్లాన్ ఎత్తేసిన JIO.. నెట్టింట విమర్శలు

డైలీ 1GB డేటా రీచార్జ్ ప్లాన్‌ను ఎత్తేయడంతో JIOపై విమర్శలొస్తున్నాయి. ఈ నిర్ణయం ఎంతో మందికి అధిక భారం కావొచ్చని, ఇష్టానుసారంగా ప్లాన్స్ ఛేంజ్ చేస్తుంటే TRAI నిద్రపోతోందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరసమైన ధరలకే రీఛార్జ్ లభించే ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNLలో సిగ్నల్స్ సమస్య వెంటాడుతోందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా 5G తీసుకొచ్చి, మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మీ కామెంట్?
News August 19, 2025
మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన

సెప్టెంబర్ 30 నుంచి జరిగే ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు ప్లేయర్లు అరుంధతి రెడ్డి, శ్రీచరణికి చోటు దక్కింది.
జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (WK), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తికా భాటియా (WK), స్నేహ్ రాణా