News August 20, 2025
ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.
Similar News
News August 20, 2025
ఢిల్లీకి CM రేవంత్.. రేపటి OU పర్యటన వాయిదా

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా రేవంత్ సైతం ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన వాయిదా పడింది. ఓయూ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 21న రేవంత్ ఉస్మానియాకు వెళ్లాల్సి ఉంది.
News August 20, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు

నేరం చేస్తే పీఎం, సీఎం, మంత్రులకు ఉద్వాసన పలికేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఆ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సీఎంలను అన్యాయంగా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. అయితే అందుకు భిన్నంగా శశి థరూర్ స్పందిస్తూ ఆ బిల్లుల్లో లోపమేమీ లేదని అభిప్రాయపడ్డారు.
News August 20, 2025
నేనిప్పుడే రిటైర్ అవ్వను: నాగవంశీ

‘వార్-2’ సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని, అందుకే సినిమాలు ఆపేసి నిర్మాత దుబాయ్‌కి వెళ్లిపోతున్నారంటూ వచ్చిన వార్తలను నాగవంశీ ఖండించారు. ఆ టైం ఇంకా రాలేదని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాను రిటైర్ అయ్యేందుకు ఇంకా 10-15 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఆల్ వేస్ ఫర్ సినిమాస్ అంటూ రాసుకొచ్చారు. తర్వాత సినిమా ‘మాస్ జాతర’తో మళ్లీ మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.