News January 11, 2025
గేమ్ ఛేంజర్ తొలిరోజు కలెక్షన్లు ఎన్నంటే?

రామ్చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిన్న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38Cr, హిందీలో రూ.7Cr, తమిళ్లో రూ.2Cr వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. మరి మీరూ మూవీ చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT
News December 10, 2025
మహిళలు టూర్లకు ఎక్కువగా ఎందుకు వెళ్లాలంటే?

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇప్పుడు సోలోగా ట్రిప్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మన సమాజంలో వస్తున్న ఓ పెద్ద మార్పు. మహిళలు టూర్లకు వెళ్లడం వల్ల ఎంపవర్మెంట్, ఫ్రీడమ్, పర్సనల్ గ్రోత్, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం మెరుగవడం, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం, కొత్త బంధాలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు టూర్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.


