News February 18, 2025

1947లో ధరలిలా ఉండేవి!

image

డాలర్ విలువ ఒక రూపాయితో సమానంగా ఉండేది. 10 గ్రాముల బంగారం ధర రూ.88 మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక జీతం రూ.2వేలు. చీపెస్ట్ కార్ రూ.2500. సౌత్ ఢిల్లీలో ఒక ఎకరం భూమి ధర రూ.17వేలు, ముంబైలో 2BHK రెంట్ రూ.20-50 మాత్రమే. బేసిక్ మెడికల్ టెస్టులు రూ.100- రూ.500. రూ.25కే సైకిల్ వచ్చేది. రూ.4కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 27 పైసలు.

Similar News

News December 3, 2025

చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.