News October 24, 2025

భారత్ ఓటమికి కారణాలివే?

image

నిన్న AUS చేతిలో టీమ్‌ ఇండియా ఓటమికి ప్రధాన కారణం మెయిన్ స్పిన్నర్‌ కుల్దీప్‌ను ఆడించకపోవడమేనని తెలుస్తోంది. మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. అటు ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ జంపా 4 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ నితీశ్ కాకుండా సుందర్ ముందుగా రావడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. కోచ్ గంభీర్ నిర్ణయాలతో పాటు కొత్త కెప్టెన్ గిల్ అనుభవలేమి కనిపిస్తోంది. మీ కామెంట్?

Similar News

News February 11, 2026

హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

image

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.

News February 11, 2026

పట్నా ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

బిహార్ పట్నాలోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌ 16 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. బేసిక్ పే రూ.67,700. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 11, 2026

వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

image

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.