News April 18, 2024
PV, మన్మోహన్ తెచ్చిన సంస్కరణలు ఏంటి?1/2

సుప్రీంకోర్టులో తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా PV నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ప్రధాని PV నేతృత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడింది.
➯1991 నాటికి దేశంలో ప్రతీ నిర్ణయం GOVT చేతుల్లోనే ఉండేది. లైసెన్స్ రాజ్ అనే ఈ విధానాన్ని PV ప్రభుత్వం రద్దు చేసింది.
Similar News
News November 10, 2025
కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ, ఐటీ శాఖకు చెందిన 10కి పైగా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సహా సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో పనుల పాలనా అనుమతులపై చర్చిస్తోంది.
News November 10, 2025
డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్(కశ్మీర్)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
News November 10, 2025
గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.


