News April 16, 2025

TGలో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40KM వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Similar News

News April 16, 2025

అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే అమరావతిలో పనులు పూర్తయ్యాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పరిశ్రమలు వచ్చి భూముల ధరలు పెరుగుతాయి. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని CM భావించారు’ అని ఆయన పేర్కొన్నారు.

News April 16, 2025

సీఎంను కలిసిన 16వ ఆర్థిక సంఘం బృందం

image

AP: పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై సీఎం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వారికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక సాయంపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.

News April 16, 2025

కంచ గచ్చిబౌలి: ప్రభుత్వానికి దక్కని ఊరట

image

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో TG ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. గతంలో విధించిన ‘స్టేటస్ కో’ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. దీంతో మే 15 వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు వీల్లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని కోర్టు స్పష్టం చేసింది. CSను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని స్పష్టం చేసింది.

error: Content is protected !!