News January 26, 2025

మా గురించి ఒక్క మాటలో.. ఏం చెబుతారు..?

image

ఏ విషయాన్నైనా యూజర్లకు వే2న్యూస్ సరళంగా, సంక్షిప్తంగా చెబుతోంది. అలాంటి వే2న్యూస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరేం చెబుతారు. మా గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ‘వే2న్యూస్ అంటే ఇది’ అనేలా ఒక్కమాటలో మంచి ట్యాగ్ లైన్ ఇస్తే రూ.25 వేల ప్రైజ్ మనీ మీ సొంతం.
కింద Submit Now బటన్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌‌లో మీ ట్యాగ్ లైన్ మాకు చెప్పండి.
<>Submit Now<<>>

Similar News

News December 13, 2025

జగిత్యాల: పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తి

image

జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మూడో ర్యాండమైజేషన్ ద్వారా పూర్తయిందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. 1531 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2031 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి, ఏడు మండలాల్లో బ్యాలెట్ బాక్సుల తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు.

News December 13, 2025

పెద్దపల్లి ఆసుపత్రి సేవలు సంతృప్తికరం: జిల్లా జడ్జి

image

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి కుంచాల సునీత లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె ఆసుపత్రి సేవలను పరిశీలించి, సూపరింటెండెంట్ డా. కె.శ్రీధర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలను ప్రజలు మరింతగా ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి సూచించారు.

News December 13, 2025

44 గంటలు సభలు, ర్యాలీలపై నిషేధం: ASF కలెక్టర్

image

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగిసినట్ల ASF జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు. పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.