News February 9, 2025
రేషన్ కార్డులపై ఏమిటీ గందరగోళం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739065205888_653-normal-WIFI.webp)
TG: ప్రజాపాలన, సర్వేలో వినతుల మేరకు కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ మీసేవలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇంతలో EC దీనికి బ్రేక్ వేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మీసేవలో అప్లై చేసుకోవడానికి వీలులేదని సర్కార్ చెప్పింది. ఇక కార్డుల జారీకి తాము బ్రేక్ వేయలేదని EC తెలిపింది. వీటన్నింటితో ‘ఇక కార్డులు వచ్చినట్టే’ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
Similar News
News February 9, 2025
దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737718673775_1032-normal-WIFI.webp)
AP: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫొటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు. వారు ఆ ఫొటోలతో బాధితురాలిని బెదిరించారు. దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్‌తో కలిసి బాధితురాలు కంచికచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2025
రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739073867605_81-normal-WIFI.webp)
TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.
News February 9, 2025
బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739072476025_653-normal-WIFI.webp)
TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.