News February 27, 2025
రేపటి డేట్తో ముందు రోజు అరెస్ట్ ఏంటి?: శ్యామల

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి? అని YCP అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ‘ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని అక్రమ అరెస్టు ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
News December 13, 2025
టుడే టాప్ స్టోరీస్

*విశాఖలో 9 IT సంస్థలకు CM చంద్రబాబు, లోకేశ్ శంకుస్థాపన
*ఉత్తరాంధ్రలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై CM CBN ఏరియల్ సర్వే
*మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం రాకండి: మంత్రి కోమటిరెడ్డి
*ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. సిగ్గుండాలి: కవిత
*మూడ్రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం
*ఉపాధి హామీ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్పు
*ఎప్స్టీన్ ఫైల్స్.. ట్రంప్, క్లింటన్, బిల్గేట్స్ ఫొటోలు
News December 13, 2025
అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.


