News June 19, 2024
MP, MLAగా కొనసాగితే తప్పేంటి?: RLP నేత

ఒకే సమయంలో MP, MLAగా కొనసాగితే తప్పేంటని RLP నేత హనుమాన్ బేనీవాల్ అన్నారు. అమెరికాలో ఇలాంటి నిబంధన ఉందని, మనదేశంలో కూడా ఉంటే బాగుంటుందన్నారు. ‘రెండు పదవుల్లో కొనసాగితే నష్టమేంటి? ప్రజలే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లో కొనసాగే నిబంధన ఉండాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మన దేశంలో MLAగా, MPగా ఒకేసారి ఉభయ సభల్లో సభ్యుడిగా ఉండేందుకు వీలు లేదు.
Similar News
News November 8, 2025
పెసర, మినుము పంటల్లో విత్తనశుద్ధికి సూచనలు

పెసర, మినుములో చీడపీడల నివారణకు విత్తనశుద్ధి కీలకం. అందుకే విత్తడానికి ముందు ఒక కిలో విత్తనానికి 3గ్రా. మ్యాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసి తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. చివరగా విత్తే ముందు ఎకరానికి 200గ్రా. రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
News November 8, 2025
నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 8, 2025
బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.


