News July 6, 2024
వాట్సాప్ చాట్‌ను సాక్ష్యంగా పరిగణించలేం: HC

వాట్సాప్ చాట్‌ను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అవి వాస్తవమైనవేనంటూ తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే తప్ప సాక్ష్యంగా గుర్తించలేమని తెలిపింది. డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థపై అదీల్ ఫిరోజ్ అనే వినియోగదారుడు 2022లో జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. దీనిపై విచారణ సందర్భంగా కమిషన్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఇలా స్పందించింది.
Similar News
News October 29, 2025
ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.
News October 29, 2025
బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.
News October 29, 2025
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 308 పోస్టులు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 308 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, వొకేషనల్ కోర్సు చదివిన అభ్యర్థులు NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. ITI అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:https://cochinshipyard.in/


