News December 23, 2024

ఈ మోడల్ ఫోన్లలో WhatsApp పని చేయదు!

image

పదేళ్లు దాటిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ OSతో పని చేసే ఫోన్లలో JAN 1, 2025 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S3, S4 మినీ, నోట్2, మోటో జీ, మోటో రేజర్ HD, మోటో E 2014, LG నెక్సస్ 4, LG G2 మినీ, సోనీ ఎక్స్‌పీరియా Z, SP, V, HTC 1X, 1X+ తదితర మోడల్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. అలాగే ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ మే 5 నుంచి ఇదే నిబంధన వర్తించనుంది.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో తొలి IFAS టెక్నాలజీ!

image

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్‌డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్‌లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్‌లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.

News December 2, 2025

‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

image

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.

News December 2, 2025

పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

image

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్‌ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.